Advertisement

  • ఐపీఎల్‌ సీజన్‌లో ఇంటి నుంచే వ్యాఖ్యానం విధానం(వర్చువల్‌ కామెంట్రీ)

ఐపీఎల్‌ సీజన్‌లో ఇంటి నుంచే వ్యాఖ్యానం విధానం(వర్చువల్‌ కామెంట్రీ)

By: chandrasekar Fri, 24 July 2020 10:15 AM

ఐపీఎల్‌ సీజన్‌లో ఇంటి నుంచే వ్యాఖ్యానం విధానం(వర్చువల్‌ కామెంట్రీ)


యూఏఈలో జరిగే ఐపీఎల్‌ సీజన్‌లో వర్చువల్‌ కామెంట్రీని ప్రవేశపెట్టాలని టోర్నీ ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్‌ భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఇప్పటికే చెస్‌ తదితర క్రీడల్లో వర్చువల్‌ టోర్నీలు కూడా జరుగుతున్నాయి.

ఇటీవల సౌతాఫ్రికాలో కొత్త ఫార్మాట్లో నిర్వహించిన 3టీసీ సాలిడారిటీ కప్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఇంటి నుంచే వ్యాఖ్యానం విధానం విజయవంతమైంది. సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌ పా‌ర్క్‌లో జరిగిన లైవ్‌ మ్యాచ్‌కు బరోడా నుంచి ఇర్ఫాన్‌ పఠాన్‌, కోల్‌కతా నుంచి దీప్‌దాస్‌ గుప్తా, ముంబైలోని తన నివాసం నుంచి సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

ఈ ప్లాన్ విజయవంతం కావడంతో రాబోయే ఐపీఎల్‌లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై స్టార్‌స్పోర్ట్స్‌ ఆలోచిస్తోంది. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లో ఐపీఎల్‌ ప్రసారాల కోసం బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌స్పోర్ట్స్‌ 10 ఫీడ్‌లను అందిస్తున్నది. మొత్తం ప్రేక్షకుల సంఖ్యలో మూడింట రెండు వంతుల మంది హిందీ ఛానెల్‌ను వీక్షిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement