Advertisement

  • నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు

నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు

By: chandrasekar Thu, 26 Nov 2020 11:18 AM

నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు


నివర్ తుఫాను అతి తీవ్ర రూపం దాల్చడం వల్ల భారీ నష్టాలకు దారి తీసింది. ఆగ్నేయ తీరంలో తీవ్ర తుఫాన్ నివర్ అల్లకల్లోలం సృష్టించింది. తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాలపై విరుచుకుపడింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో పాటు ప్రచండ గాలులు వీస్తున్నాయి. ఏపీలోని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలపైనా ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఏపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఇక కడప జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప కలెక్టర్‌ హరికిరణ్ సూచించారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తుపాను ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశముందని తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయాలు, జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ భారీ వర్షాల వల్ల చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరమైన ఇసుక సంచులను అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. పూరిళ్లు, పెంకుటిళ్లు, గుడిసెలు, పాత ఇళ్లల్లో ఉండే వారు ఖాళీ చేసి బంధువులు ఇళ్లు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. తుఫాన్ కారణంగా జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలకు సెలవు ప్రకటించారు.

నివర్ తుఫాను హెల్ప్ లైన్ కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు వాడుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కంట్రోల్ రూమ్- 08562 - 245259, సబ్ కలెక్టర్ కార్యాలయం, కడప- 08562 - 295990, 93814 96364, 99899 72600, సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజంపేట- 08565 - 240066, 93816 81866, ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు - 96766 08282, 08560- 271088.

భారీ ఎదురు గాలులు మరియు వర్షాల వల్ల రైళ్ల రాకపోకలపైనా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే చెన్నై నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి, రేణిగుట, పాకా వైపు వెళ్లే రైళ్లపై ప్రభావం ఉండనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇందుకోసం సికింద్రాబాద్‌- 040-27833099, విజయవాడ- 0866-2767239, గుంటూరు- 0863-2266138, గుంతకల్లు- 7815915608 అందుబాటులో ఉంచారు. ఎలాంటి సంఘటన చోటుచేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags :

Advertisement