Advertisement

  • 42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టన హోల్డర్

42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టన హోల్డర్

By: chandrasekar Fri, 10 July 2020 2:48 PM

42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టన హోల్డర్


సౌథాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ నిప్పులు చెరిగాడు. 20 ఓవర్లు బౌలింగ్ చేసిన హోల్డర్ 42 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టడంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే కుప్పకూలిపోయింది.

ఆ జట్టులో కెప్టెన్ బెన్‌స్టోక్స్ (43: 97 బంతుల్లో 7x4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌కి వర్షం పదే పదే ఆటంకం కలిగించడంతో నిన్న కేవలం 17.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దాంతో ఆటలో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ స్కోరు 35/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీమ్ వరుసగా వికెట్లు చేజార్చుకుని 67.3 ఓవర్లలోనే ఆలౌటైంది.

హోల్డర్‌ (6/42)కి తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ గాబ్రిల్ (4/62) కూడా చెలరేగడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. మధ్యలో బెన్‌స్టోక్స్ పోరాడినా అతనికి సహకరించేవారు టీమ్‌లో కరవయ్యారు. వికెట్ కీపర్ జోస్ బట్లర్ (35: 47 బంతుల్లో 6x4) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. కరోనా వైరస్ కారణంగా 117 రోజులు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఈ టెస్టుతో మొదలైంది. పూర్తిగా బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ సిరీస్‌ని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తుండగా సక్సెస్ అయితే మిగిలిన దేశాలు కూడా సిరీస్‌లు ప్రారంభించే అవకాశం ఉంది.

Tags :
|
|

Advertisement