Advertisement

  • రోహిత్ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయం ... బీసీసీఐ వర్గాలు

రోహిత్ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయం ... బీసీసీఐ వర్గాలు

By: Sankar Tue, 08 Dec 2020 5:01 PM

రోహిత్ ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడం ఖాయం ... బీసీసీఐ వర్గాలు


ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక టెస్ట్‌ సిరీస్ లో చివరి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ అందుబాటులోకి వచ్చే అవకాశాలు న్నాయి. కండర గాయంతో ప్రస్తుతం బెంగళూరు జాతీయ అకాడమీలో పునరావాసంలో ఉన్న రోహిత్‌ ఈనెల 11న ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు హాజరుకానున్నాడు. రోహిత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో పాసై అతడు ఈనెల 12న ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఆసీస్‌ చేరుకున్నాక రోహిత్‌ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఆపై వారం రోజులు ప్రాక్టీస్‌ అనంతరం సిడ్నీలో జనవరి 7 నుంచి జరిగే మూడో టెస్ట్‌కు సిద్ధమవుతాడని భావిస్తున్నారు. మొదటి టెస్ట్‌ తర్వాత కెప్టెన్‌ కోహ్లీ భారత్‌ రానుండడంతో జట్టులో రోహిత్‌ ఉండాల్సిన అవసరం ఎంతో ఏర్పడింది.

ఇక రోహిత్‌ ప్రస్తుతం సామర్థ్యం పెంచుకొనే చర్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్న అతడు..బరువు కూడా తగ్గినట్టు కన్పిస్తోంది. ఎన్‌సీఏ నుంచి రోహిత్‌ ఆదివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో గమనిస్తే..ఐపీఎల్‌ నాటికి ఇప్పటికి సన్నబడినట్టు అర్థమవుతోంది.

Tags :

Advertisement