Advertisement

ఇక ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ మాయం..

By: Sankar Thu, 02 July 2020 9:19 PM

ఇక ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ మాయం..



అమెరికాలో నల్ల జాతీయుడిని పోలీసులు హత్యా చేసిన ఘటన వలన ప్రపంచం మొత్తం తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి ..బ్లాక్ లివ్స్ మేటర్ అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది తమ నిరసనలను వ్యక్తం చేసారు ..

ఆ నిరసనల వలన ‘ఫేర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్‌ పేరు నుంచి ఫేర్‌ అనే పదం మాయం కానుంది. ఫేర్‌ అనే పదం మనిషి చర్మం తెలుపు రంగును సూచిస్తున్న విషయం తెల్సిందే. హిందుస్థాన్‌ యూనిలివర్‌ కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండ్‌ పేర్ల నుంచి, వాణిజ్య ప్రకటనల నుంచి ఫేర్, ఫేర్‌నెస్‌ పదాలతోపాటు ‘వైటెనింగ్, లైటనింగ్‌’ అనే పదాలను కూడా తొలగించాలని నిర్ణయించింది. ’ఫేర్‌ అండ్‌ లవ్లీ’ బ్రాండ్‌ పేరు నుంచి ఫేర్‌ పదాన్ని తొలగిస్తానని చెప్పిన కంపెనీ ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంటున్నట్లు ఎక్కడా తెలియజేయలేదు. చర్మ రంగును తెలుపు చేస్తుందన్న ప్రచారంతోని ఆ కంపెనీ ఆ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆ ఉత్పత్తి అలాగే కొనసాగించాలనుకుంటే ‘చర్మ సౌందర్యం కోసం’అని మార్చుకోవచ్చు.

అదే విధంగా స్కిన్‌ వైటెనింగ్‌ ఉత్పత్తులను ఉపసంహరించుకొంటున్నామని ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ కూడా ప్రకటించింది. వాటి ఉత్పత్తులకు మరిన్ని మిశ్రామాలను జోడించి, మరింత మెరుగ్గా మరో పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తామని ఆ కంపెనీ తెలిపింది. ఆ కంపెనీ చర్మ సౌందర్యం కోసం అంటుందా, మరో పేరు పెడుతుందా ? చూడాలి. ఈ రెండు కంపెనీల తరహాలోనే ‘వైటెనింగ్‌’ పేరిట లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఇతర కొస్మోటెక్‌ కంపెనీలు కూడా చర్మం రంగును తెలియజేసే పదాలన్నింటిని తామూ ఉపసంహరించుకుంటామని, వాటికి స్కిన్‌ కేర్‌ అని పేర్లు పెడతామని చెబుతున్నాయి. వాస్తవానికి ఆ ఉత్పత్తులేవీ కూడా స్కిన్‌ కేర్‌ కిందకు రావు.

Tags :
|

Advertisement