Advertisement

హిందీ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత

By: chandrasekar Thu, 05 Nov 2020 10:53 AM

హిందీ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత


ప్రముఖ నటుడు యూసఫ్‌ఖాన్‌ కుమారుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూశారు. హిందీ నటుడు ఫరాజ్‌ ఖాన్‌ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ‘ఫరీబ్‌’ (1996), ‘మెహందీ’ (1998) తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. బాలీవుడ్‌ నటుడు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ ఫేమ్‌ యూసఫ్‌ఖాన్‌ కుమారుడు ఫరాజ్‌.

సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘మైనే ప్యార్‌కియా’కి మొదటగా ఫరాజ్‌ఖాన్‌నే హీరోగా అనుకున్నారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు ఫరాజ్‌ తీవ్ర అనారోగ్యానికి గురికావటంతో ఆ సినిమా చేసే అవకాశం సల్మాన్‌ఖాన్‌ దక్కించుకున్నారు.

కాగా కొన్ని వారాల క్రితం పహ్‌ మాన్‌ ఖాన్‌ తన సోదరుడు ఫరాజ్‌ అనారోగ్యం గురించి వివరిస్తూ ఆర్థిక సహాయం కూడా కోరారు. అప్పుడు సల్మాన్‌ ఖాన్‌ సహాయం చేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఈ విషయాన్ని ప్రముఖ నటి, దర్శకురాలు పూజా భట్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈయన చెస్ట్, మరియు బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌‌కు సంబంధించిన హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతూ బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ వైరస్ ఛాతి నుంచి మెదడుకు వ్యాపించడంతో ఆయన ఆరోగ్యం విషమించి మరణించనట్టు హాస్పటల్ వర్గాలు తెలిపాయి.

Tags :
|
|
|
|
|

Advertisement