Advertisement

  • కరోనా బాధలు తొలగుటకు బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ లో హిజ్రాల పూజలు

కరోనా బాధలు తొలగుటకు బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ లో హిజ్రాల పూజలు

By: chandrasekar Tue, 09 June 2020 7:30 PM

కరోనా బాధలు తొలగుటకు బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ లో  హిజ్రాల పూజలు


బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో మహిళలు, హిజ్రాలు కలిసి ‘కరోనా దేవి’ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజల బాధ్యతలను ఓ హిజ్రా చేపడుతున్నది. ఏకంగా కరోనా దేవే ఆవు రూపంలో ఆమె కలలో కనిపించందంటూ చెబుతున్నది.

ఒక రోజు కరోనా దేవి ఆవు రూపంలో ఆ హిజ్రా కలలోకి వచ్చి అనంతరం మహిళగా మారిపోయింది. ప్రజలంతా ఆ దేవతను పూజించినట్లయితే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్లిపోతానని చెప్పిందట. అందుకే దేశంకోసం వీరంతా కలిసి కరోనా దేవికి పూజలు చేస్తున్నారని వాపోయారు.

లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోయాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో వ్యాపార సంస్థలు పాత వైభోగాన్ని సంతరించుకుంటున్నాయి. దీంతో కరోనా దాడి రోజురోజుకు పెరగడమే కాని అదుపుచేయలేక పోతున్నాం. ఇక ఆ దేవుడి మీదే భారం వెయ్యాలి. అందుకే ఈ పూజలు నిర్వహిస్తున్నామని నేతృత్వం వహిస్తున్న హిజ్రా చెప్పుకొచ్చింది. ‘పూజలు చేస్తే కరోనా వెళ్లిపోతుందా?’ కరోనాదేవికి పూజ చేస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అని నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.

Tags :

Advertisement