Advertisement

  • ఆన్ లైన్ క్లాసులు విషయంలో తల్లితండ్రులకు ఎటువంటి ఒత్తిడి లేదు ..హైకోర్టు కు తెలిపిన ఇస్మా

ఆన్ లైన్ క్లాసులు విషయంలో తల్లితండ్రులకు ఎటువంటి ఒత్తిడి లేదు ..హైకోర్టు కు తెలిపిన ఇస్మా

By: Sankar Fri, 03 July 2020 3:50 PM

ఆన్ లైన్ క్లాసులు విషయంలో తల్లితండ్రులకు ఎటువంటి ఒత్తిడి లేదు ..హైకోర్టు కు తెలిపిన ఇస్మా



కరోనా కాలంలో పాఠశాలలు అన్ని మూత పడటంతో విద్యార్థులు గత మూడు నెలలుగా ఇంటి దగ్గరే ఉంటున్నారు ..మాములుగా అయితే ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కావాలి కానీ కరోనా కారణంగా పాఠశాలల ప్రారంభంపై ఎవరు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు ..అయితే ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ..స్కూల్ ఫీజు లు చెల్లించాలని లేకపోతే ఆన్ లైన్ క్లాస్కు అనుమతి ఉండదు అని వేదిస్తున్నాయని కొంతమంది హైకోర్టు లో ఫిర్యాదు చేసారు ..దీనితో హైకోర్టు ఆన్ లైన్ క్లాస్ లపై ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేసారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ..

అయితే ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్‌ సమావేశం అనంతరం విద్యాసంవత్సరం ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకుందని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదిన లిభితపూర్వకం నిర్థిష్ట ప్రణాళిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

అదే విధంగా ఆన్‌లైన్‌ క్లాసెస్‌పై ఇండిపెండెంట్‌ స్కూల్‌ మెనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ ఇంప్లీడ్‌(ఇస్మా) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా గత రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్‌ మాత్రమేనని ఇస్మా పిటిషన్‌లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వంకు ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి​ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇస్మాకు హైకోర్టు ఆదేశిచింది. తదపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది

Tags :

Advertisement