Advertisement

  • నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు...

నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు...

By: chandrasekar Mon, 07 Dec 2020 6:56 PM

నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు...


GHMC ఎన్నికల ఫలితాలకు సంబంధించి నేరేడ్‌మెట్ డివిజిన్‌లో ఏర్పడిన సందిగ్ధంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని ఓట్లను లెక్కించాలని స్పష్టం చేసింది. బ్యాలెట్ మీద స్వస్తిక్ ముద్రతో పాటు ఇతర ముద్ర (పెన్ను టిక్ మార్క్, సున్నా చూట్టడం, టిక్ పెట్టడం) ఉన్న 544 ఓట్లను కూడా లెక్కించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం కలిపి రీ కౌంటింగ్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కౌంటింగ్ కోసం పెండింగ్‌లో ఉన్న ఒక బాక్సును కూడా ఓపెన్ చేసి ఓట్లను లెక్కించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. డిసెంబర్ 1న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 4న కౌంటింగ్ జరిగింది.

ఆ కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం బ్యాలెట్ పత్రాల మీద స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతరత్రా గుర్తులు పెన్నుతో టిక్ పెట్టి ఉన్నా, చుక్క పెట్టి ఉన్నా కూడా దాన్ని ఓటుగా గుర్తించాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని బీజేపీ తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సర్క్యులర్‌ను సస్పెండ్ చేసింది. తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉండాలని చెప్పింది. అయితే, ఎన్నికలకు సంబంధించి ఈసీ విధుల్లో కోర్టుల జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ ఎస్ఈసీ మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్వస్తిక్ గుర్తులతో పాటు ఇతర గుర్తులు ఉన్నా కూడా వాటిని ఓటుగా గుర్తించాలని స్పష్టం చేసింది.

Tags :

Advertisement