Advertisement

  • పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై TS ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ

పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై TS ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ

By: chandrasekar Sat, 20 June 2020 5:03 PM

పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై TS ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై పలు ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

దీనిపై డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఆయన వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న న్యాయస్థానం ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల విచారించిన న్యాయ స్థానం వారికి ఏ చట్ట ప్రకారం కోత విధిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

హైకోర్టు ప్రశ్నించిన కొన్ని రోజుల్లోనే విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్‌ ఆమోదించడంతో ఆర్డినెన్స్‌కు సంబందించి గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది.

Tags :
|
|

Advertisement