Advertisement

  • వ్యవసాయేతర ఆస్తుల నమోదు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్

వ్యవసాయేతర ఆస్తుల నమోదు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్

By: Sankar Wed, 04 Nov 2020 7:54 PM

వ్యవసాయేతర ఆస్తుల నమోదు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్ట్


వ్యవసాయేతర ఆస్తుల సమాచారం ఇవ్వాలంటూ ప్రజలను ఒత్తిడి చేయ రాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబం ధించి ఆధార్‌ నంబర్, కులం వివరాలు సేకరించొ ద్దని స్పష్టం చేసింది.

ఇప్పటికే సేకరించిన కోటి మంది ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించింది. సమర్థమైన చట్టాలు రూపకల్పన చేయకపోతే ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకొస్తున్న ధరణిని పోలిన నాలుగు యాప్స్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రభుత్వం నిర్వహిస్తున్నదో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచారాన్నే హ్యాక్‌ చేసినట్లుగా పత్రికల్లో కథనాలు చూశాం. ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని హ్యాకర్స్, ఇతరులు తస్కరించకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని హ్యాక్‌ చేయరనే భరోసా ఏంటి? ఆధార్‌ వివరాలను సంక్షేమ పథకాల అమలులో భాగంగా మాత్రమే తీసుకోవాలని సుప్రీం కోర్టు పుత్తస్వామి కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది.

అయినా 2020లో తెచ్చిన చట్టంలో పేర్కొనకుండా, సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఆధార్‌ వివరాలను ఎందుకు సేకరిస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలంటూ మా ఇంటికీ వచ్చి దరఖాస్తులు ఇచ్చారు. అయితే వచ్చిన వారు ప్రభుత్వ అధికారులేనా? వ్యవసాయ భూముల వివరాల సేకరణకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్, భూ హక్కుల చట్టం–2020 వ్యవసాయ భూములకు మాత్రమే. అలాంటప్పుడు వ్యవసాయేతర ఆస్తుల వివరాలు కోరడం చట్టబద్దం కాదు’అంటూ ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Tags :

Advertisement