Advertisement

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

By: chandrasekar Tue, 21 July 2020 5:34 PM

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం


తెలంగాణ సర్కారుపై కరోనా వైరస్ విషయమై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు, కరోనా హెల్త్ బులిటెన్‌లో సమాచారం అసమగ్రంగా ఉందని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించింది.

హాస్పిటల్‌లో బెడ్ల సమాచారం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించింది. తాము పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా ఖాతరు చేయడం లేదని మండిపడింది.

రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుంటే స‌ర్కారు నిద్ర‌పోతుందా అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా టెస్లు విషయానికి వస్తే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఎంతో వెనుకబడి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడదో చెప్పాల‌ని.. కేసు నమోదు చేసి ఎందుకు స‌స్పెండ్ చేయ‌కూడ‌దో చెప్పాల‌ని ఏజీని న్యాయస్థానం ప్ర‌శ్నించింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags :
|

Advertisement