Advertisement

మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌

By: chandrasekar Thu, 04 June 2020 11:52 AM

మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌


అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి తెలిపారు. మహారాష్ట్ర, డయ్యూడామన్‌, గుజరాత్‌కు ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్ తీరాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో భయంకరమైన గాలులు వీస్తాయని, ముంబై వాసులు అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు.

high,alert,in three,states,rains ,మూడు, రాష్ట్రాల్లో, హై, అలర్ట్‌,ముంబై మహానగరాన్ని


అరేబియా సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం దక్షిణ నైరుతి దిశగా 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ప్రారంభంలో మంగళవారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్‌ (రైగర్, మహారాష్ట్ర), దామన్‌ మధ్య ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ తీరాలను దాటే అవకాశం ఉంద’ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ అధికారి రాజారావు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ముంబైపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందన్న సమాచారం నేపథ్యంలో కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో మాట్లాడారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు 39 బృందాలను పంపినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రకటించింది.

Tags :
|
|
|

Advertisement