Advertisement

హార్థిక్‌ పాండ్యా... కొడుకు పేరు భలే పెట్టాడు

By: Dimple Sat, 29 Aug 2020 01:36 AM

హార్థిక్‌ పాండ్యా... కొడుకు పేరు భలే పెట్టాడు

ముంబయి ఇండియన్స్‌ యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన భార్యా, కుమారుడిని చాలా మిస్సవుతున్నాడు! ఐపీఎల్‌-2020 కోసం అబుదాబికి వెళ్లిన జట్టు సభ్యులంతా కుటుంబాలతో సమయం ఆస్వాదిస్తున్నారు. అతడేమో ఒంటరిగా క్వారంటైన్‌లో కాలం గడుపుతున్నాడు. అందుకే నిత్యం నటాషా స్టాంకోవిచ్‌, నెల రోజుల పిల్లాడైన తన కుమారుడిని తలుచుకుంటున్నాడు. వారికి సంబంధించిన జ్ఞాపకాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు.
తాజాగా అతడు నటాషాతో కలిసుకున్న పాత చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ‘ఎక్కడ చూస్తున్నావ్‌’ అని తన సతీమణిపై పంచ్‌ విసిరాడు. రెండు రోజుల క్రితం తన సతీమణితో వీడియోకాల్‌లో మాట్లాడిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశాడు. ‘మిమ్మల్నిద్దరినీ చాలా మిస్సవుతున్నాను. మీరు నా జీవితంలో ఉండటం నా అదృష్టం’ అని రాశాడు.

దుస్తుల ఎంపిక, వ్యవహారశైలిలో ఆధునికంగా కనిపించే పాండ్య తన కుమారుడికి పెట్టిన పేరు ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిన్నారికి ‘అగస్త్య’ అని నామకరణం చేశాడని సమాచారం. తన నిశ్చితార్థం నుంచి బిడ్డను కనేంత వరకు పాండ్య దంపతులు అన్నీ రహస్యంగానే ఉంచిన సంగతి తెలిసిందే.

Tags :

Advertisement