Advertisement

  • బిగ్ బాస్ లో పాల్గొంటున్న అని వస్తున్న వార్తలపై హెచ్చరించిన శ్రద్దా దాస్

బిగ్ బాస్ లో పాల్గొంటున్న అని వస్తున్న వార్తలపై హెచ్చరించిన శ్రద్దా దాస్

By: Sankar Tue, 28 July 2020 3:23 PM

బిగ్ బాస్ లో పాల్గొంటున్న అని వస్తున్న వార్తలపై హెచ్చరించిన శ్రద్దా దాస్



బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు సీజన్ 4 త్వరలో మొదలవబోతుంది..దీనికి సంబందించిన ఆఫిసియల్ ప్రోమో కూడా విడుదల అయింది...అయితే ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి బిగ్ బాస్ యజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ముందుగానే ఊహాగానాలకు తెరదీస్తున్నారు .. ఆ లిస్టులో హీరోయిన్ శ్రద్దా దాస్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో తాజాగా ఈ విషయమై స్పందిస్తూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది ఈ హాట్ బ్యూటీ.

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. నేను అందులో పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఇలాంటి వార్త‌లు రాసేముందు కాస్త క్లారిటీ తీసుకుంటే మంచిది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటా'' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది శ్రద్దా దాస్. ఈ రకంగా బిగ్ బాస్ 4లో శ్రద్దా దాస్ పాల్గొనడం లేదని కన్ఫర్మ్ అయింది.

ప్రస్తుతం ఈ షో కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారని, కరోనా విజృంభణ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా కోవిడ్‌ టెస్ట్ చేశాకే అనుమతించబోతున్నారని తెలుస్తోంది. ఈ షోని గత సీజన్‌లా 100 రోజులు కాకుండా తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేయనున్నారని సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ 4 కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం.

Tags :

Advertisement