Advertisement

  • సినిమాలో నేనూ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిని

సినిమాలో నేనూ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిని

By: Dimple Sat, 05 Sept 2020 09:49 AM

సినిమాలో నేనూ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిని

సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం. సినిమాల్లో అవకాశాలకోసం క్యాస్టింగ్‌ కౌచ్‌ పై అడపాదడపా... రకరకాల సందర్భాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి.

చిరంజీవి ‘జైచిరంజీవ’, ఎన్టీఆర్‌ ‘అశోక్‌’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ నాయిక సమీరా రెడ్డి. తనూ కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే అని ఈ మధ్య ఓ ఇంటర్య్వూలో తన బాధను బయటపెట్టింది.

‘‘నేను ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. ఆ రోజు సెట్‌లో ఉండగానే స్క్రిప్టు మార్చి ముద్దు సన్నివేశం పెట్టారు. నాకు స్క్రిప్టు చెప్పినప్పుడు ఈ సీన్‌ లేదు. నేను చేయను అని చెప్పా. ‘మీ ఇష్టం ఆలోచించుకోండి...మీ స్థానంలో వేరే వాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది’ అని వాళ్లు హెచ్చరించారు’.

వైకుంఠపాళీ ఆటలాంటి ఈ పరిశ్రమలో పాముల నోటికి చిక్కకుండా అడుగులు వేయాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎన్నో సినిమాలను వదిలేసుకున్నాను. షూటింగ్‌లయ్యాక జరిగే పార్టీ కల్చర్‌కు నేను అలవాటుపడితే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని నాకు తెలుసు.

కానీ వద్దనుకున్నా. బాలీవుడ్‌లో నేను అగ్రిమెంట్‌ చేసిన ఓ సినిమా నిర్మాత వచ్చి.. మీరు ఈ పాత్రకు సరిపోరు అని చెప్పి వెళ్లిపోయారు. ఓ స్టార్‌కిడ్‌కు ఆ ప్రాత ఇచ్చేందుకే అలా చెప్పారని తర్వాత తెలిసింది. నెపోటిజిమ్‌ ఇక్కడ చాలా ఎక్కువ. అయినా చిత్ర పరిశ్రమ నాకు ఎన్నో మంచి పాత్రలను ఇచ్చింది. అందుకే ఈ పరిశ్రమ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు’’అని చెప్పింది.

Tags :

Advertisement