Advertisement

  • హీరోయిన్ బాలయ్య డైలాగ్... ఇఫ్ యూ ట్రబుల్... చెప్పడానికి కారణం ఏంటి?

హీరోయిన్ బాలయ్య డైలాగ్... ఇఫ్ యూ ట్రబుల్... చెప్పడానికి కారణం ఏంటి?

By: chandrasekar Thu, 15 Oct 2020 3:52 PM

హీరోయిన్ బాలయ్య డైలాగ్... ఇఫ్ యూ ట్రబుల్... చెప్పడానికి కారణం ఏంటి?


ప్రస్తుతం సోషల్ మీడియాలో నటి అశిమా నర్వాల్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా? అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో... ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐ యామ్ నాట్ ది ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్ అంటూ బాలయ్య బాబు ఆవేశంగా చెప్పిన ఆ ఫేమస్ డైలాగ్ అంటే తెలియని వాళ్లుండరు.

ఆ డైలాగ్ ఎవరు చెప్పినా.. బాలయ్య బాబు నిలువెత్తు రూపమే కళ్ల ముందు కదలాడుతుంది. కానీ అంత సీరియస్ డైలాగ్‌ని ఈ హీరోయిన్ తన మత్తు కళ్లతో స్లో మోషన్‌లో చెప్పుకొస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి?

అశిమా ఈ డైలాగ్ చెప్పడానికి ఓ కారణం ఉంది. భూమాతను కాలుష్యంతో ఇబ్బందులు పెడుతున్నామని అందుకే ఆ భూమాత మనల్ని ఇబ్బంది పెడుతోందని అలా కాకుండా పర్యావరణం కోసం పాటుపడితే అప్పుడు ఈ వైరస్‌లు, వర్షాలతో ప్రళయాలు రావనే సందేశం ఇస్తూ అశిమా ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇక సిగరేట్ స్మోకింగ్ విషయానికి వస్తే తాను తన కొత్త సినిమాలో పాత్ర కోసం ప్రాక్టీసింగ్ చేస్తున్నట్టు అశిమా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపింది.

Tags :

Advertisement