Advertisement

ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న హీరో విశాల్...?

By: chandrasekar Wed, 16 Dec 2020 9:20 PM

ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న హీరో విశాల్...?


తమిళనాడు ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చే ఓ వార్త ఇప్పుడు తమిళనాడులో ప్రచారంలో ఉంది. నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందిన హీరో విశాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడట. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, ఎమ్‌జీఆర్ ఎన్నో సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలను ఏలారు. ప్రస్తుతం విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్‌ రాజకీయాల్లో తమ సత్తా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ ఈ నెల 31న కొత్త పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో తమిళ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోనున్నాయి. రజినీకాంత్‌తో కలిసి పనిచేసేందుకు ఇతర రాజకీయ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చెన్నై నగరంలోని ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశాల్ తయారవుతున్నాడట. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని విశాల్ ప్లాన్ చేస్తున్నాడట. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో విశాల్‌ పోటీకి సిద్ధమయ్యాడు. తిపాదించిన వారిలో కొంత మంది మద్దతు ఉపసంహరించుకోవడంతో ఎన్నికల కమిషన్‌ విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ ఉపఎన్నికల్లో విశాల్‌ పోటీ చేయలేకపోయాడు. తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సెగ ఇప్పుడే ప్రారంభమైంది.

Tags :
|
|

Advertisement