Advertisement

  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన మరొక స్టార్ హీరో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన మరొక స్టార్ హీరో

By: Sankar Mon, 14 Dec 2020 5:07 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించిన మరొక స్టార్ హీరో


వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు ఇప్పుడే వేడెక్కాయి..ముఖ్యంగా ఈ సారి ఎన్నికలో సినిమాల నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ ,లోక నాయకుడు కమల్ హాసన్ బరిలోకి దిగుతుండటంతో మరింత ఆసక్తికరంగా మారయి...ఇక ఇప్పుడు మరొక స్టార్ హీరో కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు...

నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెన్నైలోని ఏదైన ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ ప్రవేశం చేయాలని విశాల్‌ నిర్ణయించుకున్నాడు. అంతేగాక తన పోలీటికల ఎంట్రీ కోసం అభిమాన సంఘాల నేతలతో చర్చలు కూడా జరుపుతున్నాడంట. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాడనేది విషయంపై స్పష్టత లేదు.

Tags :

Advertisement