Advertisement

  • తన సినిమాల డబ్బింగ్ తో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో రామ్

తన సినిమాల డబ్బింగ్ తో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో రామ్

By: Sankar Tue, 17 Nov 2020 10:54 PM

తన సినిమాల డబ్బింగ్ తో సరికొత్త రికార్డు సృష్టించిన హీరో రామ్


టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సినిమా హిందీలో డబ్ అయితే.. యూట్యూబ్ పండుగ చేసుకుంటుంది. ఈ ఎనర్జిటిక్‌ హీరో నటించిన సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లో పెడితే.. ఒక్కో చిత్రాన్ని 10 కోట్లకు పైగా నెటిజన్లు చూశారు.

వరుసగా నాలుగు సినిమాలు ఒక్కోటి 100 మిలియన్ వ్యూవ్స్ దాటాయి. నేను శైలజ.. హలోగురు ప్రేమకోసమే హిందీ అనువాదాలైతే.. 200 మిలియన్‌ వ్యూవ్స్‌ దాటేసి 300 మిలియన్‌ వైపు దూసుకుపోతున్నాయి. నేను శైలజ హిందీలో "ది సూపర్ కిలాడి3" టైటిల్‌తో యూ ట్యూబ్‌లో రిలీజ్ అయింది.

ఇప్పటివరకు 275 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. అంటే ఈ సినిమాను 27 కోట్ల మంది చూశారన్న మాట. ఇక్కడ హిట్టయినా.. ఫట్టయినా.. హిందీలో మాత్రం రామ్ సినిమా హిట్టే.ఇక ఇస్మార్‌ శంకర్‌ను అదే పేరుతోనే రిలీజ్‌ చేస్తే.. 14 కోట్ల మంది చూసేశారు. ఇలా ఆరు 100 మిలియన్‌ మార్క్‌ ఉన్న సినిమాలు రామ్‌కు తప్ప మరో హీరోకు లేవు.

Tags :

Advertisement