Advertisement

హీరో రాజశేఖర్ హెల్త్ బులెటిన్...!

By: Anji Sat, 31 Oct 2020 7:16 PM

హీరో రాజశేఖర్ హెల్త్ బులెటిన్...!

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యముగా సినీ, రాజకీయనేతలు ఎక్కువ సంఖ్యలో పడుతుండడం కార్య కర్తల్లో , అభిమానుల్లో కలవరపెడుతుంది.

ఇక చిత్ర సీమా విషయానికి వస్తే ఇప్పటికే అగ్ర దర్శకులు , నిర్మాతలు , నటి నటులు దీనిబారిన పడగా..కొంతమంది క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందికి దీనికి బలయ్యారు.

రాజశేఖర్‌, ఆయన కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారనే వార్త తెలిసినప్పటి నుండి అందరిలో ఆందోళన పెరిగింది. తాజాగా రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం పరిస్థితి ఫై జీవిత అప్డేట్ రిలీజ్ చేసారు.

రాజశేఖర్ ఆరోగ్యం విషయమై జీవిత మాట్లాడుతూ… ఇన్ని రోజులు వెంటి లేటర్ ద్వారా శ్వాస అందించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించడం జరిగింది. స్వతంత్ర్యంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు.

ఇన్ఫెక్షన్ కూడా దాదాపు 80 శాతం వరకు తగ్గిందని వైధ్యులు తెలియజేశారు. మరికొన్ని రోజుల్లోనే ఆయన ఐసీయూ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కరోనా నుండి ఇంకా ఆయన తేరుకోలేదా నెగటివ్ రిపోర్ట్ రాలేదా అనే చర్చ జరుగుతోంది.

Tags :

Advertisement