Advertisement

రేప్ ఆరోపణలను ఖండించిన హీరో కృష్ణుడు..

By: Sankar Fri, 28 Aug 2020 7:42 PM

రేప్ ఆరోపణలను ఖండించిన హీరో కృష్ణుడు..


139 మంది అత్యాచారం చేసారు అని ఒక మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి..ఇప్పటికే ఇందులో యాంకర్ ప్రదీప్ పేరు రాగ తాను ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే..ఇప్పుడు తాజాగా నటుడు కృష్ణుడు పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి..దీనితో ఈ విషయం మీద కృష్ణుడు మాట్లాడారు..

ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ న్యూస్ తెలియగానే షాక్ అయ్యాను. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హీరోగా, ఆర్టిస్ట్‌ చాలామందితో కలిసి పనిచేశాను. ఎప్పుడూ కూడా నాపై ఆరోపణలు లేవు. నాకు మందు అలవాటు లేదు.. సిగరెట్ అలవాటు లేదు.. పబ్‌లకు వెళ్లను. అలాంటి నాపై రేప్ ఆరోపణలు రావడం షాక్‌లోకి వెళిపోయా.

ఈ విషయం మొదట నా భార్యకి చెప్పాను. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడంతో నా భార్య.. నీ గురించి నాకు తెలుసు అని చెప్పింది. నేను అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నా.. ఇక్కడ చాలామంది ఉంటారు.. మా ఫాదర్ రీసెంట్‌గా చనిపోయారు... ఊర్లో అమ్మ ఒక్కరే ఉన్నారు. వాళ్లందరిపై ఈ ఆరోపణలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయని ఆలోచించాలి. ఒకరిపై ఆరోపణలు చేసేటప్పుడు ఇంకే ఆలోచించరా?? మా ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు.. నాకు కూతురు ఉంది.. ఆధారాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసేసి.. లబ్ధి పొందాలనుకుంటే ఈ ప్రభావం రేపటి రోజున చాలామందిపై పడుతుంది.

నాపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నా.. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నాపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి.. ఇది నా పరువుకి సంబంధించిన విషయం కాబట్టి దీని వెనుక ఎవరున్నా యాక్షన్ తీసుకుంటా. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. వేరే వ్యక్తితో కలిసినేను ఆమె దగ్గరకు వెళ్లినట్టు ఆరోపిస్తోంది. ప్రసాద్ అనే ఫ్రెండ్ నాకు ఉన్నట్టు అందరికీ తెలుసు. అతను కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకున్నానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. అతను అసలు ఫొటోగ్రాఫర్ కాదు.. నేను 2002 ఫ్యాషన్ ఫొటోగ్రఫీ చేసి.. 2003లో మూసేశా. స్టుడియోకి అతనికి ఏం సంబంధం లేదు. ఆమె చేసే ఆరోపణలు అన్నీ తప్పే. ప్రసాద్ కూడా ఈ విషయాన్ని విని షాక్ అయ్యాడు. అతను కూడా కులాంతర వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో ఉన్నాడు. దీని వెనుకాల ఎవరో ఉన్నారు. కావాలని ఆడిస్తున్నారు.

నాకు ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ కూడా రాలేదు. అయితే లాక్ డౌన్ టైంలో నల్గొండ నుంచి కాల్ వచ్చింది.. మీ ఫ్యాన్‌ని మీరంటే అభిమానం అని మామూలు ఫ్యాన్‌గా మాట్లాడారు. కాని ఆ ఫోన్ కాల్‌లో కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా.. నాకు ఓ కూతురు ఉంది.. మా భార్యను నిర్మాతగా పెట్టి సినిమా కూడా మొదలుపెట్టా. నేను మహిళలకు ఎంత గౌరవం ఇస్తానో ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. ఇలాంటి ఘటనల్ని అందరూ ఖండించాలి.. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. ఖచ్చితంగా ఈ కేసులో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటా.. లీగల్‌గా ముందుకు వెళ్తా అంటూ చెప్పుకొచ్చాడు హీరో కృష్ణుడు.

Tags :
|
|
|

Advertisement