Advertisement

  • ఎస్పీబీ భారత రత్నకు అన్ని విధాలా అర్హుడు ..యాక్షన్ హీరో అర్జున్

ఎస్పీబీ భారత రత్నకు అన్ని విధాలా అర్హుడు ..యాక్షన్ హీరో అర్జున్

By: Sankar Sat, 26 Sept 2020 1:51 PM

ఎస్పీబీ భారత రత్నకు అన్ని విధాలా అర్హుడు ..యాక్షన్ హీరో అర్జున్


గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆయన మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. పలువురు సినిమా తారలు , రాజకీయ ప్రముఖులు ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురవుతున్నారు.

ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన తుదిశ్వస విడిచారు. 16 భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడిన ఒకే ఒక గొప్ప వ్యక్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. నటుడిగా సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు పేరుపొందాడు. సంగీత ప్రపంచంలో ఆయనని ఎవరూ అందుకోలేరు. ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా అవార్డులు సంపాదించారు.

ఇక బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న ఇవ్వాలని హీరో అర్జున్ డిమాండ్ చేశారు. 45 వేల పాటలు రెండు జన్మలు ఎత్తినా ఇంకెవ్వరు పాడలేరని అర్జున్ అన్నారు. పాటలో చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా సరే బాలు ఆ పాటను పాడే వారు కాదని అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయనకు భారతరత్న కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు అన్నీ కలిసి పోరాడాలని సూచించారు. భారత రత్నకు ఎస్పీబీ అన్ని విధాల అర్హుడు అని తెలిపారు.

Tags :

Advertisement