Advertisement

  • భారత్ లాంటి పెద్ద జనాభా దేశాల్లో హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు ..ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌

భారత్ లాంటి పెద్ద జనాభా దేశాల్లో హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు ..ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌

By: Sankar Thu, 30 July 2020 9:46 PM

భారత్ లాంటి పెద్ద జనాభా దేశాల్లో హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు ..ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌



కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే ప్రజలు అందరిలో హార్డ్ ఇమ్మ్యూనిటి డెవెలప్ అవ్వాలని చాల మంది వైద్యులు చెబుతున్నారు ఆలా అయితేనే ఇలా కరోనా మహమ్మారి నుంచి బయటపడొచ్చు అని అంటున్నారు ..అయితే ఇండియాలో మాత్రం హార్డ్ ఇమ్మ్యూనిటి సాధ్యం కాదు అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ గురువారం మీడియాతో మాట్లాడారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఓ వ్యాధి నుంచి కాపాడే పరోక్ష రక్షణ పద్దతి. ఈ విధానం జనాలను జబ్బుల నుంచి కాపాడుతుంది. అది ఎప్పుడంటే గతంలో ఆ జనాభా అదే వ్యాధి నుంచి కోలుకున్నప్పుడు.. లేదా దానికి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భారతదేశానికి హెర్డ్‌ ఇమ్యూనిటీ అనే ఆప్షన్‌ ఇప్పుడు పనికిరాదు. వ్యాక్సిన్‌ లేకుండా హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించడం చాలా ఖర్చుతో కుడుకున్న ప్రక్రియ.

ఇప్పుడే దీన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఇది ఆరోగ్య మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేస్తుంది. ఎందరినో బలి తీసుకుంటుంది. భవిష్యత్తులో వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన తర్వాతనే హెర్డ్‌ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలి’ అన్నారు రాజేష్‌ భూషణ్‌

Tags :
|
|

Advertisement