Advertisement

  • వ్యాక్సినేషన్ను ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చు: డబ్ల్యూహెచ్వో

వ్యాక్సినేషన్ను ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చు: డబ్ల్యూహెచ్వో

By: chandrasekar Wed, 19 Aug 2020 5:29 PM

వ్యాక్సినేషన్ను ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చు: డబ్ల్యూహెచ్వో


డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రోగ్రాంలో ప్రపంచ దేశాలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనాను జయించడం సాధ్యం కాదని ప్రకటించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటం కష్టమని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఘెబ్రెయెసస్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ క్షేమకరమని తేలితే తొలి దశ వ్యాక్సిన్‌ను హెల్త్ వర్కర్లు, 65 ఏళ్లు దాటిన వారికి అందించాలని ఆయన సూచించారు. ముందుగా అన్ని ప్రపంచ దేశాల్లోనూ రిస్క్ ఎక్కువగా ఉన్న వారిని కాపాడుకోవాలన్నారు. ఇలా చేయడం వల్ల వేగంగా కరోనాను అంతమొందించి, ఆర్ధిక వ్యవస్థను సరిచేయవచ్చు అని టెడ్రోస్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ 22 మిలియన్ల మంది కరోనా వైరస్ బారిన పడగా వీరిలో 7.75 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధకులు, ఫార్మా దిగ్గజాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

కొవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ ఫెసిలిటీలో భాగమైన 29 టీకాల్లో 9 వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగాల దశలో ఉన్నాయి. సమర్థవంతమైన వ్యాక్సిన్లను కనుగొనడం, ఉత్పత్తి, పంపిణీ కోసం కొవాక్స్‌పై ఇప్పటి వరకూ 92 దేశాలు సంతకాలు చేశాయి. మరో 80 దేశాలు ఆసక్తి చూపినా పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో ఆగష్టు చివరిలోగా అందులో చేరాలని డబ్ల్యూహెచ్‌వో ఆ దేశాలను కోరింది. వ్యాక్సిన్ కేటాయింపులో ముందుగా ఇందులో భాగమైన సభ్య దేశాలన్నింటికీ ఒకేసారి వ్యాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో కరోనా ముప్పు, దుర్బలత్వం ఆధారంగా దేశాల వారీగా వ్యాక్సిన్ అందజేస్తారు.

ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరణించే ముప్పు ఎక్కువ ఉన్నవారితో కాంటాక్ట్ అవుతుంటారు. కాబట్టి తొలి దశ వ్యాక్సినేషన్‌లో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని టేడ్రోస్ కోరారు. 65 ఏళ్లు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వ్యాక్సిన్ ముందుగా ఇవ్వాలన్నారు. చాలా దేశాలు తొలి దశలో రిస్క్ ఎక్కువగా ఉండే 20 శాతం జనాభాకు వ్యాక్సిన్లు అందించాలని సూచించారు. రిస్క్ ఎక్కువగా ఉన్నవారిని వైరస్ బారి నుంచి కాపాడుకోలేకపోతే ఆరోగ్య వ్యవస్థలను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిమిత పర్చలేమని ట్రేడోస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న హెర్డ్ ఇమ్యూనిటీ కరోనాను ఆపడానికి సరిపోదని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైకెల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. హెర్డ్ ఇమ్యూనిటీ కాపాడుతుందని ప్రజలు ఆశించొదని ఇప్పటికైతే అది పరిష్కారం కాదన్నారు. వ్యాక్సినేషన్‌ను ఎక్కువగా ఇవ్వడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించొచ్చన్నారు.

Tags :
|

Advertisement