Advertisement

  • తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు....హెల్ప్‌లైన్ నంబర్లు

తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు....హెల్ప్‌లైన్ నంబర్లు

By: chandrasekar Wed, 14 Oct 2020 10:10 AM

తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు....హెల్ప్‌లైన్ నంబర్లు


తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హైదరాబాద్ - విజయవాడ రహదారిపై చాలా ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా భారీ వృక్షాలు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు రోడ్లకు అడ్డంగా కూలాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో, జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 6 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల ప్రమాదాలు సంభవించాయి. పురాతన ఇళ్లు కూలిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ విధించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని మంత్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం, అత్యవసర సేవల కోసం ఎమర్జెన్సీ, హెల్ప్ లైన్ నంబర్లను ఇచ్చారు.

హెల్ప్ లైన్ నంబర్లు:

అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్: 211111111
Ghmc డిసాస్టర్ dept ఎమర్జెన్సీ, ph: 9000113667
GHMC ట్రీ కటింగ్: cell:-6309062583
వాటర్ లాగింగ్ సెల్ :-9000113667
ఎలక్ట్రిక్ కంట్రోల్: Cell:-94408 137 50
N. D. R. F: cell:- 8333068536
M.C.H డిసాస్టర్: cell:- 97046018166

Tags :

Advertisement