Advertisement

  • రానున్న మూడు రోజుల్లో దక్షిణ కర్ణాటక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల్లో దక్షిణ కర్ణాటక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

By: chandrasekar Thu, 13 Aug 2020 04:26 AM

రానున్న మూడు రోజుల్లో దక్షిణ కర్ణాటక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు


రానున్న మూడు రోజుల్లో దక్షిణ కర్ణాటక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు కర్ణాటకలోని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ సంవత్సరం దేశంలోని పలు చోట్ల రెండు నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ స్థాయి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయువ్య భారతదేశంలో ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

ఈ నెల 12 నుంచి 15 వరకు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు, కొంకణ్, ఉత్తర గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తామని ఐఎండీ పేర్కొంది. పోయిన వరం ముంబై లో బారి వర్షాలు పడడంతో ఊరంతా జలమయమైన విషయం అందరికి తెలిసిందే. రాబోయే 24 గంటల్లో తూర్పు రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్నిచోట్ల మెరుపులు, ఉరుములతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అదే విధంగా మరోవైపు ఈ నెల 12 నుంచి 16 వరకు ఉత్తర కన్నడ, ఉడిపి, దక్షిణా కన్నడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కర్ణాటకలోని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే కర్ణాటకలో వర్షాలు బాగా పడడంతో పలు డ్యాంలలో నీటి ఎత్తు బాగా పెరిగింది. పెరిగిన నీటి మట్టాన్ని జాగ్రత్త సూచిక మించకుండా తగ్గించడానికి తగు జాగ్రత్తలు తీసికొంటున్నారు. కర్ణాటకలో వర్షాలు బాగా పడడంతో తమిళనాడులోని రైతులకు కావలసినన్ని నీరు అందుతున్నాయి. కర్ణాటక నుండి నీరు కాలువలు ద్వారా తమిళనాడు లోనికి ప్రవహించడంతో వ్యవసాయ రైతులు సంతోషిస్తున్నారు.

Tags :
|

Advertisement