Advertisement

అమెరికాలో భారీ మంచు తుపాను

By: chandrasekar Sat, 19 Dec 2020 11:44 AM

అమెరికాలో భారీ మంచు తుపాను


అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో మంచు తుపాను తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. శీతాకాలం వల్ల ఇక్కడ 14 రాష్ట్రాలను మంచు తుఫాను ముంచెత్తుతుంది. అమెరికాలోని న్యూయార్క్ బుధ, గురువారాల్లో కురిసిన తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో 40 అంగుళాల మేర రోడ్లపై మంచు పేరుకుపోయింది.

మంచు తుఫానుకు చలిగాలి తోడవడంతో న్యూఇంగ్లాండ్ ‌ప్రాంతంలోని రాష్ట్రాల్లోను మరియు మిడ్‌ అట్లాంటిక్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. రాజధాని వాషింగ్టన్‌ డీసీతో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, వర్జీనియా, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్ తదితర రాష్ట్రాల్లో దట్టమైన మంచు కురుస్తోంది. మంచు తుఫాను ప్రభావిత ప్రాంతాలనుండి 60 లక్షల మందిని అప్రమత్త పరిశీలనలో ఉంచినట్లు అధికారులు చెప్పారు.

పలు విమానాశ్రయాల్లో మంచు పేరుకుపోవడంతో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పెన్సిల్వేనియాలో పలు వాహనాలు ప్రమాదాలకు గురైనట్లు తెలిపారు. అంతే కాకుండా విద్యుత్‌ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. తుపాను తగ్గగానే మంచు తవ్వే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ తుఫాను ప్రభావం ఒకటీ రెండు రోజుల్లో తగ్గు ముఖం పట్టవచ్చని తెలిపారు.

Tags :
|

Advertisement