Advertisement

విశాఖలో భారీగా సముద్రపు చేపలు ఒడ్డుకు

By: chandrasekar Wed, 19 Aug 2020 4:07 PM

విశాఖలో భారీగా సముద్రపు చేపలు ఒడ్డుకు


విశాఖపట్టణంలో భారీగా సముద్రపు చేపలు ఒడ్డుకు చేరాయి. విశాఖలో భారీగా సముద్రం చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం కలకలం సృష్టించింది. ఋషీకొండ తీరంలో భారీగా చేపలు కొట్టుకు రావడంతో స్థానికులు చేపలు ఏరుకునేందుకు పోటీపడ్డారు. ఒడ్డంతా చేపలు ఉండడంతో జనాలు చేపలను ఎగబడి తీసుకున్నారు.

మాములుగా సముద్రపు ఆటుపోట్లు సమయంలో అప్పుడప్పుడు చేపలు కొట్టుకు వస్తాయని స్థానికులు చెబుతున్నారు. వాతావరణ లో వస్తున్న మార్పులు కారణంగా కూడా జరిగి వుండవచ్చని మత్స్యకారులు చెబుతున్నారు. గతంలోనూ ఇలా చేపలు సముద్రంలోకి కొట్టుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని వారు వెలిబుచ్చారు.

ఏడాది క్రితం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామ సమీపంలోని లక్షలాది చేపలు ఇలాగే సముద్రతీరానికి ఇలాగె కొట్టుకొచ్చాయి. చేపలు భారీగా సముద్రంలో నుండి కొట్టుకురావడానికి మరేమైనా కారణాలు ఉండొచ్చన్న అంశంపైనా అధికారులు పరిశీలన చేస్తున్నారు. మత్స్యకారులు ఏమో అప్పుడప్పుడు సముద్రాలలో సంభవించే ఆటుపోట్లు వల్ల ఇలా జరిగిందని చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement