Advertisement

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు

By: Sankar Wed, 19 Aug 2020 7:23 PM

ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు


వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. గోదావరికి వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో జిల్లా అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంత, లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 40 కి.మీ నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.

Tags :
|

Advertisement