Advertisement

  • అలెర్ట్ ..వచ్చే నాలుగు రోజులు తెలంగాణాలో భారీ వర్షాలు

అలెర్ట్ ..వచ్చే నాలుగు రోజులు తెలంగాణాలో భారీ వర్షాలు

By: Sankar Thu, 20 Aug 2020 7:50 PM

అలెర్ట్ ..వచ్చే నాలుగు రోజులు తెలంగాణాలో భారీ వర్షాలు


రాబోయే నాలుగు రోజుల్లోతెలంగాణాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా వాయు తుఫాను సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది అని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

ఆగస్టు 23 వరకు రాష్ట్రంలోని చాలా ప్రదేశాలలో మోస్త‌రు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన ప‌డే అవ‌కాశం ఉంది. ఆగస్టు 23న మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, వ‌రంగ‌ల్ రూర‌ల్‌, వ‌రంగ‌ల్ అర్బ‌న్, మ‌హ‌బూబాబాద్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, జ‌న‌గామ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రాబోయే రెండు రోజులు లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

Tags :
|

Advertisement