Advertisement

ఆగని వానలు ..కొనసాగుతున్న అల్పపీడనం..

By: Sankar Tue, 15 Sept 2020 11:05 AM

ఆగని వానలు ..కొనసాగుతున్న అల్పపీడనం..


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది. ఉత్తర కోస్తాలో కొనసాగుతున్న అల్పపీడనంపై ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురవనున్నాయి.

అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మిగతా చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి.

రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. అటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

Tags :
|
|
|

Advertisement