Advertisement

  • Breaking News: వాయుగుండం ప్రభావం... ఏపీలో అతి భారీ వర్షాలు..!

Breaking News: వాయుగుండం ప్రభావం... ఏపీలో అతి భారీ వర్షాలు..!

By: Anji Tue, 13 Oct 2020 10:54 AM

Breaking News: వాయుగుండం ప్రభావం... ఏపీలో అతి భారీ వర్షాలు..!

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర కాసేపటి క్రితం తీరాన్ని దాటింది. అయితే పూర్తిగా తీరాన్ని దాటడానికి మరికొంత సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనితో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలులు వీస్తుండగా.. తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి.

ఈ క్రమంలోనే రాగల నాలుగైదు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే వాయుగుండం తీరం దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయంది.


శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని… ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే వాయుగుండం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు.

Tags :

Advertisement