Advertisement

  • బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణలోని 19 జిల్లాల్లో భారీ వర్షాలు...!

బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణలోని 19 జిల్లాల్లో భారీ వర్షాలు...!

By: Anji Mon, 12 Oct 2020 10:33 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలంగాణలోని 19 జిల్లాల్లో భారీ వర్షాలు...!

తూర్పు, ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రెండు రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతారణశాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఏర్పడిన వాయుగుండం... గంటగంటకు తీవ్రంగా మారుతోంది.

ఈ ప్రభావం తెలంగాణపై పడి... కొన్ని చోట్ల విస్తారంగా భారీ వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావం... రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని 19 జిల్లాల్లో వాయుగుండం ప్రభావం చూపుతుందని తెలిపారు.

విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 430 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయ దిశగా 490 కిలో మీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 520 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం తీవ్రమై... పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.... ఉత్తరాంధ్ర తీరంలో నర్సాపూర్‌-విశాఖ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

అటు... తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించిన నేపథ్యంలో... ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Tags :
|

Advertisement