Advertisement

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబై ..

By: Sankar Thu, 06 Aug 2020 3:38 PM

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ముంబై ..



ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో ఒకపక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే.. మరోపక్క భారీ వర్షాలు అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులతో పాటు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ముంబై భారీ వర్షాలపై ట్విటర్‌లో స్పందించారు..

బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్‌ చేసినట్లుగా కనిపించాయి. గాలి బీభత్సం చూస్తే.. ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది. మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి.

నెటిజన్లు షేర్‌ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్‌ డ్రామాటిక్‌ వీడియోగా నిలిచింది.' అంటూ కామెంట్‌ చేశారు. మరోవైపు నెటిజన్లు ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం మహీంద్రా కామెంట్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక వర్షాలు అధికంగా కురుస్తుండటంలో ముంబై, పుణెలో రెడ్‌అలర్ట్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షాన్ని రికార్డు చేసింది. 1974 తర్వాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది

Tags :
|
|

Advertisement