Advertisement

  • రాజధానిలో భారీ వర్షం వచ్చే అవకాశం ..హైదరాబాద్ వాతావరణ కేంద్రం

రాజధానిలో భారీ వర్షం వచ్చే అవకాశం ..హైదరాబాద్ వాతావరణ కేంద్రం

By: Sankar Thu, 27 Aug 2020 1:25 PM

రాజధానిలో భారీ వర్షం వచ్చే అవకాశం ..హైదరాబాద్ వాతావరణ కేంద్రం


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధీలో భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహా నగరంలోని పలు చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఈ మేరకు మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధం చేశారు.

బంగాళాఖాతంలో ఈ నెల 24న ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి ననుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ ఆర్భన్‌, కామారెడ్డి జిల్లాలోని ఒకంట్రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్య సూచనలు ఉన్నట్లు తెలిపింది.

కాగా బుధవారం రాష్ట్రంలో 1.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉత్త‌ర భార‌త దేశంలో భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి. ఈ విష‌యాన్ని భార‌తీయ వాతావ‌ర‌ణ‌శాఖ వెల్ల‌డించింది. ఇక ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఆగ‌స్టు 27, 28వ తేదీల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది..

Tags :
|
|

Advertisement