Advertisement

  • ఏపీలో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

ఏపీలో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

By: Sankar Sun, 22 Nov 2020 09:02 AM

ఏపీలో రాగల రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు


ఏపీలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది రానున్న 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణించి.. ఈ నెల 25న తమిళనాడు-పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతోనే ఈ నెల 24,25 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే గంటకు 55 నుంచి 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. ఆయా తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Tags :
|

Advertisement