Advertisement

  • రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు....

రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు....

By: Sankar Sat, 28 Nov 2020 9:47 PM

రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు....


అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది. రాగల 3 రోజుల్లో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరో రెండు మూడు రోజుల్లో ఇంకో తుఫాను వచ్చే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిథిలోని అధికారులందరూ పూర్తి అప్రమత్తతతో ఉండాలని మంత్రి బొత్స సూచించారు.

Tags :
|
|

Advertisement