Advertisement

రాగల 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు

By: Sankar Fri, 13 Nov 2020 10:26 AM

రాగల 48 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు


ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక తీరం నుంచి పశ్చిమ బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు…. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు సూచించారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక తీరానికి దగ్గరలోని నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర ఆంధ్రా తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోన్న అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement