Advertisement

దేశంలోనే తొలిసారి అది పోలవరంలో...!

By: Anji Fri, 18 Dec 2020 08:34 AM

దేశంలోనే తొలిసారి అది పోలవరంలో...!

ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. సీఎం జగన్ పోలవరం పర్యటన తర్వాత కీలకమైన పనులు ప్రారంభమయ్యాయి.

ప్రపంచంలోనే అరుదైన పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ గేట్లకు రంగం సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన హైడ్రాలిక్ క్రస్ట్ గేట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది.

స్పిల్ వే పిల్లర్లు నిర్మాణం 55మీటర్లు పూర్తి అవ్వడంతో గేట్ల ఏర్పాటుకు అనుకూలమైంది. ప్రపంచంలోనే ఇటువంటి ప్రాజెక్ట్ మూడోది కాగా.. దేశంలో తొలిసారిగా పోలవరంతో ప్రారంభమైంది.

ఒక్కో గేటు 300 టన్నుల బరువు ఉంటుంది. మొత్తం గేట్లకు వినియోగించే స్టీలు 18వేల టన్నులు.. పోలవరం ఆరమ్స్ ప్రపంచంలోనే పెద్దవి. గేట్లు పైకి, కిందకి కదలడానికి, వరద నీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతి వినియోగం హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.

దేశంలోనే పోలవరంతో ప్రారంభంకాగా.. జర్మనీ నుండి పోలవరం గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను ప్రాజెక్టు వద్దకు చేర్చారు.

ముందుగా గేట్లును లిప్ట్ చేసే ఆర్మ్ గడ్డర్ల అసెంబ్లింగ్ ప్రారంభమైంది. ఒక్కో గేటుకు 8ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి.. అలాగే 4 హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి,. కుడి పక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి.

వీటిని ఆర్మ్ అసెంబ్లింగ్ అంటారు.. ఆర్మ్ అసెంబ్లింగ్ మొత్తం 31 టన్నులు ఉంటుంది. మొత్తం 12 గడ్డర్లు ఉంటాయి. ఇలా 48గేట్లుకు సంబంధించి 384 ఆర్మ్ గడ్డర్లు, 192 హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి.

ఒక్క ఆర్మ్ గడ్డర్ 16 మీటర్లు పొడవు ఉంటుంది. ఆర్మ్ గడ్డర్లు, హారిజాంటల్ గడ్డర్లు అసెంబ్లింగ్ చేసిన తరువాత స్కిన్ ప్లేట్ బిగిస్తారు.

ఈ ఆర్మ్ గడ్డర్లు సాయంతో గేట్లకు సంబందించిన స్కిన్ ప్లేట్‌ను పైకి లేపుతారు. ఎంత ఎత్తుకు గేటును లేపాలనుకుంటే అంత ఎత్తులో లేపడానికి ఈ ఆర్మ్ గడ్డర్లు ఉపయోగపడతాయి.

గేట్ స్కిన్ ప్లేట్ లిప్ట్ చేయడానికి ఒక్కోగేటుకు 8 స్కిన్ ప్లేట్లు ఉంటాయి. గేట్లను ఎత్తడానికి హైడ్రాలిక్ సిలిండర్లు సాయంతో లిప్ట్ చేస్తారు.

మొత్తం 48 గేట్లుకు 96 హైడ్రాలిక్ సిలిండర్లు అవసరంకాగా.. ఇప్పటికే 46 హైడ్రాలిక్ సిలిండర్లు వచ్చాయి. మిగిలినవి జర్మనీ నుంచి రావాల్సి ఉంది.

Tags :

Advertisement