Advertisement

భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధర

By: chandrasekar Thu, 03 Sept 2020 7:02 PM

భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధర


బంగారం ధర భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయింద. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 పడిపోయింది. దీంతో ధర రూ.49,160కు తగ్గింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.570 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,630కు దిగింది. పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,400 పడిపోయింది. దీంతో ధర రూ.65,800కు దిగొచ్చింది.

పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 1951 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో వెళ్ళింది. వెండి ధర ఔన్స్‌కు 1.08 శాతం పెరుగుదలతో 27.69 డాలర్లకు ఎగసింది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Tags :
|
|

Advertisement