Advertisement

వీఆర్ టెక్నాల‌జీ తో హార్ట్ సర్జరీ

By: chandrasekar Mon, 01 June 2020 10:36 PM

వీఆర్ టెక్నాల‌జీ తో హార్ట్ సర్జరీ


వర్చువల్‌ రియాల్టీ వీఆర్ టెక్నాల‌జీ ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బాహుబ‌లి 2 కోసం రాజ‌మౌళి వాడిన టెక్నాల‌జీ ఇది. ఇందులో ఓ కెమెరా దాగుంటుంది. ఈ కెమెరాను బీబీ 360 అంటారు. ఇందులో 24 హై ఎండ్ కెమెరాలు క‌లిసి ఉంటాయి. 360 డిగ్రీస్ లో మ‌నం వీడియోను చూసేలా లెన్స్ ఉంటాయి. వాటి వ‌ల్ల మ‌నం నిజంగానే ఆ ప్లేస్లో ఉండి సినిమా చూస్తున్న‌ట్లు థియేట‌ర్లో ఉన్న ప్రేక్ష‌కుడికి అనుభూతి క‌లుగుతుంది. కెమెరా వ‌రల్డ్‌లో ఇది ఓ అద్భుతం అనే చెప్పాలి. బాహుబ‌లి 2 త‌ర్వాత వీఆర్ టెక్నాల‌జీకి ఇండియాలో గిరాకీ బాగా పెరిగిపోయింది.

వీఆర్‌ టెక్నాలజీని తొలిసారి ఉపయోగించి ఈజిప్ట్‌కు చెందిన ఓ చిన్నారి ప్రాణం నిలిపి చరిత్ర సృష్టించారు తమిళనాడుకు చెందిన ఎంజీఎం దవాఖాన వైద్యులు. ఈ విధానాన్ని తయారుచేసింది మద్రాస్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు. అమెరికా, యూరప్‌లోని పలు పేరొందిన దవాఖానలు చేతులెత్తేయడంతో చిన్నారి తల్లిదండ్రులు చెన్నైలోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉండటంతో వర్చువల్‌ రియాల్టీ మోడల్‌ను సిద్ధం చేసేందుకు కొంత సమయం పట్టినా ఎట్టకేళకు విజయవంతంగా గుండె సర్జరీని నిర్వహించారు.

heart,surgery,done,using,vr technology ,వీఆర్, టెక్నాల‌జీ, తో, హార్ట్, సర్జరీ


మన దేశంలో ఈ విధానంలో గుండె సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని, ఇదే విధానంలో అమెరికాలో కూడా గతంలో ఒకటిరెండు సర్జరీలు జరిగాయని ఎంజీఎం దవాఖానకు చెందిన డాక్టర్‌ కేకే బాలకృష్ణన్ తెలిపారు. ఏడాదికాలం పాటు గుండె వైఫల్య సమస్యలతోపాటు రిస్ట్రక్టీవ్‌ కార్డియోమయోపతి, తీవ్రమైన పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో పిల్లాడు బాధపడుతున్నాడని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు కైరో నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో చైన్నైకి తరలించారు.

పిల్లాడి ఆరోగ్య సమస్యలను వివరించి ఐఐటీ మద్రాస్‌ సహాయం కోరామన్నారు. కంప్యూటర్‌ గేమ్‌ మాదిరిగా 3డీ గ్లాసెస్‌తో వర్చువల్‌ రియాల్టీ మోడల్‌ను తక్కువ టైంలో సిద్ధం చేసి ఇవ్వడం వల్ల విజయవంతంగా చిన్నారికి గుండె సర్జరీ చేయగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకొని బాలీవుడ్‌ పాటలకు డ్యాన్సులు చేస్తూ హాయిగా ఉన్నాడు.

కరోనా నిబంధనలు ఎత్తివేయగానే కైరో తిరిగి వెళ్లేందుకు బాబుతోపాటు ఆయన తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల చికాగోలో వర్చువల్‌ విధానంలో జరిగిన అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ఇంటర్నల్‌ ఆర్గాన్స్‌ సమావేశంలో చెన్నై వైద్యులు నిర్వహించిన వర్చువల్‌ రియాల్టీ మోడల్‌ను ప్రదర్శించారు.

Tags :
|
|
|

Advertisement