Advertisement

  • రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ కు ఆరోగ్య మిత్ర అందుబాటులో

రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ కు ఆరోగ్య మిత్ర అందుబాటులో

By: chandrasekar Tue, 13 Oct 2020 09:59 AM

రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ కు ఆరోగ్య మిత్ర అందుబాటులో


రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి ఆరోగ్య మిత్ర అన్ని హాస్పిటల్స్ కు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మిత్ర సదుపాయాన్ని అని ఆసుపత్రుల్లో కల్పించాలి అని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి తెలిపారని సమాచారం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న వివరాలు.

ఆరోగ్య మిత్ర హెల్ప్ డెస్క్ వద్ద ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సమస్యను తెలుసుకోవాలి. సదరు ఆసుపత్రిలో వారికి వైద్యం అందని పక్షంలో వారు ఏ హాస్పిటల్ వెళ్లాలో కూడా ఆరోగ్యమిత్ర అధికారులు చూచించాలి. అక్కడి డాక్టర్స్, వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలి. ఇక హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు ANMలు టచ్ లో ఉండాలి. వారికి మెడికల్ కిట్ తప్పనిసరిగా అందించాలి. ఆరోగ్య మిత్రలు ఎలా పని చేస్తున్నారో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపారు. ఇందువల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతుందని తెలిపారు.

Tags :
|

Advertisement