Advertisement

  • కరోనా రికవరీ రేట్ పెరుగుతుంది ...కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనా రికవరీ రేట్ పెరుగుతుంది ...కేంద్ర ఆరోగ్య శాఖ

By: Sankar Thu, 09 July 2020 6:22 PM

కరోనా రికవరీ రేట్ పెరుగుతుంది ...కేంద్ర ఆరోగ్య శాఖ



దేశంలో ఒకవైపు కరోనా తీవ్రత కొనసాగుతుంటే మరో వైపు కరోనా వలన కోలుకునే వారి సంఖ్యా కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది ..రోజుకు ఇరవై వేలకు పైగా కేసులు మనదేశంలో నమోదు అవుతున్నాయి ..అయితే ప్రస్తుతం కోలుకునే వారి సంఖ్యా కూడా అదే స్థాయిలో ఉంది ..ఇదే విషయాన్నీ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ..

దేశంలో కరోనా పాజిటివ్‌ రికవరీ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. గురువారం ఆరోగ్యమంత్రిత్వశాఖ ఓఎస్‌డీ రాజేశ్‌ భూషణ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యాక్టివ్ కేసులు, రికవరీ కేసుల మధ్య ఉన్న అంతరం క్రమంగా పెరుగుతుందన్నారు. నేడు 4,76,378 రికవరీ కేసుల్లో ప్రస్తుతం 2,69,789 యాక్టిక్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. రికవరీ రేటు నిరంతరం పెరుగుతూ జూలై 9న 62.09 శాతానికి చేరుకుందని వివరించారు.

దేశంలో కొవిడ్‌-19 రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు. 60 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న వారు దేశంలో ఎనిమిది శాతమే ఉన్నారన్నారు. అయినప్పటికీ 39 శాతం కొవిడ్‌-19 మరణాలను చూపిస్తున్నారని, 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు భారతదేశ జనాభాలో 2 శాతం ఉన్నారని, కాని వారు 14 శాతం కరోనా పాజిటివ్‌ మరణాలను చూపిస్తున్నారని భూషణ్‌ పేర్కొన్నారు.



Tags :
|
|
|

Advertisement