Advertisement

  • బడికి వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

బడికి వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

By: Sankar Fri, 11 Sept 2020 05:13 AM

బడికి వెళ్లాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి


విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకోవాలంటే వారి తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అనుమతి మేరకే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల్లోకి అను మతించాలని, కట్టడి ప్రాంతాల్లో (కంటైన్మెంట్‌ జోన్లలో) పాఠ శాలలు, జూనియర్‌ కాలేజీలు తెరవకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

కంటైన్మెంట్‌ కాని ప్రాంతాల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను స్వచ్ఛందంగా పాక్షికంగా తెరుచు కోవచ్చని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థుల అను మానాలను నివృత్తి చేసేలా పాక్షికంగా ఆయా తరగతు లకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 21 నుంచి ప్రారంభించడానికి అనుమతి ఇస్తామని పేర్కొంది.

అలాగే పూర్తిస్థాయిలో ఆయా తరగతులకు చెందిన పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు తెరవాల్సి వస్తే దానికి ఎలా సన్నద్ధం కావాలన్న దానిపైనా కేంద్రం ప్రణాళిక రచించింది. అంటే పాక్షికంగా తెరవడం, పూర్తిగా తెరవడానికి అవసరమైన రెండు ప్రణాళికలను ప్రకటించింది.

Tags :
|
|

Advertisement