Advertisement

  • జన్యుచికిత్సా ప్రక్రియతో వైద్యం... అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప వెల్లడి...

జన్యుచికిత్సా ప్రక్రియతో వైద్యం... అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప వెల్లడి...

By: chandrasekar Thu, 19 Nov 2020 10:35 AM

జన్యుచికిత్సా ప్రక్రియతో వైద్యం... అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప వెల్లడి...


జన్యుచికిత్సా ప్రక్రియతో కండరాల బలహీనతతో వచ్చే రుగ్మతకు వైద్యం చేయవచ్చని అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప వెల్లడి. డుషేన్ మస్కులార్ డిస్ట్రఫీ అనేది తీవ్రమైన కండరాల బలహీనతతో వచ్చే రుగ్మత. బాల్యంలోనే సోకి, ఆ తర్వాత మరింత తీవ్రంగా విషమించే ఈ రుగ్మతకు జన్యుపరమైన చికిత్స త్వరలోనే అందుబాటులో రాబోతున్నది. డుషేన్ మస్కులార్ డిస్ట్రఫీ రుగ్మతకు ఇప్పటివరకూ నివారణ మార్గం లేదు. రోగి జీవితకాలాన్ని మెరుగుపరిచేందుకు మాత్రమే ఈ వ్యాధి లక్షణాలకు ఇప్పటివరకూ చికిత్స అందిస్తూ వస్తున్నారు.అయితే, ఈ వ్యాధి కారక కణాలను జన్యుచికిత్సా ప్రక్రియతో అదుపు చేయవచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి.)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప తెలిపారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖనుంచి ఈ ఏడాదికి స్వర్ణజయంతి ఫెలోషిప్ అందుకున్న 21మంది శాస్త్రవేత్తల్లో సందీప్ ఈశ్వరప్ప కూడా ఉన్నారు.

ఇక్కడ సాధారణంగా మానవుల్లో, శిలీంద్రాలు, బాక్టీరియా, ఈగలకు సంబంధించిన జన్యుకణాల్లో జన్యువుల కోడ్ లపై పరిశోధన ద్వారా కండరాల బలహీనత అనే రుగ్మతను పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాన్ని దెబ్బతీసి ఎం.ఆర్.ఎన్.ఎ. అనే ప్రొటీన్ కణాలను ముందస్తుగానే నిలిపివేసి ప్రొటీన్ పనిచేయకుండా ఆటంక పరచడంతో కండరాల బలహీనత అనే వ్యాధి తలెత్తుతుంది. దీనికోసం బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ప్రొఫెసర్ ఈశ్వరప్ప నాయకత్వంలోని బృందం సాగించిన పరిశోధనలతో దీర్ఘకాల వ్యవధి కలిగిన ప్రొటీన్ల స్థిరత్వం, పనితీరుపై ఆశాభావం ఏర్పడింది. మేం ఇప్పటికే మా ప్రయోగాల ద్వారా సాధించిన విజ్ఞానంతో డుషెన్ మస్కులార్ డిస్ట్రఫీ అనే కండరాల బలహీనత, రక్తస్రావం, తదితర జన్యుపరమైన వ్యాధులకు అనూహ్యమైన చికిత్సా పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఏర్పడిందని ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప తెలిపారు.

Tags :

Advertisement