Advertisement

  • సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్...

సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్...

By: chandrasekar Fri, 04 Dec 2020 8:13 PM

సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్...


తొలి టీ20లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జడేజా బదులు బరిలోకి దిగిన యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డును ఎగరేసుకుపోయాడు. 4 ఓవర్లో 25 రన్స్ ఇచ్చిన చాహల్.. ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్‌ను పెవిలియన్ చేర్చాడు. వన్డే సిరీస్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న చాహల్ టీ20ల్లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా హెల్మెట్‌కు బంతి తాకింది. ఆ తర్వాత కూడా జడ్డూ బ్యాటింగ్ చేశాడు. కానీ మ్యాచ్ విరామం తర్వాత జడేజా స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా యుజువేంద్ర చాహల్ బరిలోకి దిగుతాడని మ్యాచ్ రిఫరీకి టీమిండియా సమాచారం అందించింది. దీనికి రిఫరీ అంగీకరించారు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభం కావడానికి 10-15 నిమిషాల ముందు నువ్వు ఆడబోతున్నావని చెప్పారని మ్యాచ్ అనంతరం చాహల్ పేర్కొన్నాడు. వన్డే తప్పిదాలతో పాఠాలు నేర్చుకున్నాని చెప్పిన చాహల్ జంపా బౌలింగ్ చేసే విధానం చూసి తాను కూడా అలా ప్రయత్నించానని అన్నాడు. ఫించ్, స్మిత్ వికెట్లను తీయడం ఆనందాన్నిచ్చిందని ప్రణాళికలను అమలు చేయగలిగానని చెప్పాడు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన తొలి క్రికెటర్ యుజువేంద్ర చాహల్ కావడం విశేషం.

Tags :

Advertisement