Advertisement

  • ఆయన నన్ను తన చిన్న కొడుకులా చూసుకుంటారు; సురేశ్ రైనా

ఆయన నన్ను తన చిన్న కొడుకులా చూసుకుంటారు; సురేశ్ రైనా

By: chandrasekar Thu, 03 Sept 2020 1:00 PM

ఆయన నన్ను తన చిన్న కొడుకులా చూసుకుంటారు; సురేశ్ రైనా


వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఐపీఎల్ 2020 నుంచి సీఎస్‌కే ఆట‌గాడు సురేశ్ రైనా వైదొలిగాడు. ఇటీవ‌ల ఆ జ‌ట్టు య‌జ‌మాని శ్రీ‌నివాస‌న్ సురేశ్ రైనా ఫై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క్రిక్‌బ‌జ్‌లో మాట్లాడిన రైనా దీనిపై స్పందిస్తూ "ఆయ‌న నాకు తండ్రి లాంటి వారు. ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటారు. నా హృదయానికి దగ్గరగా ఉంటారు. ఆయ‌న న‌న్ను తన చిన్న కొడుకులా చూసుకుంటారు. ఆయ‌న ఏ ప‌రిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వ‌చ్చిందో నేను ఖ‌చ్చితంగా అర్థం చేసుకోగ‌ల‌ను. ఒక తండ్రి తన కొడుకును తిట్టగలడు" అని రైనా అన్నారు.

శ్రీ‌నివాస‌న్ మాట్లాడుతూ... అయితే ఐపీఎల్ రాబోయే సీజన్‌లో సురేశ్ రైనాను తిరిగి జట్టుతో చూడటంలో ఆశ్చర్యం లేద‌ని అన్నారు. తాను రైనాను తన కొడుకుగా చూస్తానని, అయితే రైనా పునరాగమనం గురించి ఇప్పుడే చెప్పలేనని శ్రీనివాసన్ అన్నారు.

Tags :
|

Advertisement