Advertisement

  • రోజుకొక మలుపు తిరుగుతున్న హత్రాస్ హత్యాచార ఘటన

రోజుకొక మలుపు తిరుగుతున్న హత్రాస్ హత్యాచార ఘటన

By: Sankar Tue, 06 Oct 2020 4:27 PM

రోజుకొక మలుపు తిరుగుతున్న హత్రాస్ హత్యాచార ఘటన


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈకేసు చుట్టూ రాజకీయం రంగు అలుముకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు యూపీ ప్రభుత్వం మొదట సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ ప్రస్తుతం కేసును విచారణ చేస్తున్నది.

ఇదే సమయంలో కుల ఆధారిత హింసను ప్రేరేపించేందుకు కొన్ని సంస్థలు నిధులు సమకూర్చాయనే విషయం బయటకు రావడంతో, ఈడీ రంగంలోకి దిగింది. ఆమ్నెస్థి ఇంటర్నేషనల్ సంస్థ విదేశాల నుంచి నిధులను సమీకరించింది. ఇస్లామిక్ దేశాల నుంచి నిధులను సమీకరించి దేశంలో దేశద్రోహం, కుల ఆధారిత కుట్రలకు పాల్పడేందుకు ఈ నిధులను వినియోగిస్తోందనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది, ఆ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది.

అయితే, సదరు సంస్థ ఇండియాలో కార్యకలాపాలు నిలిపివేసినట్టు తెలియజేయడంతో ఆ సంస్థకు చెందిన ఖాతాలను భారత ప్రభుత్వం స్తంభింపజేసింది. హత్రాస్ కేసుతో ఈ మనీ లాండరింగ్ కేసు ముడిపడి ఉందని పోలీసులు ఆరోపణలు చేయడమే కాకుండా కేసులు కూడా ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులతో తమకు సంబంధం లేదని, కావాలని కేసులు ఫైల్ చేస్తున్నారని ఎంజీవో సంస్థ చెప్తున్నది.

Tags :
|
|

Advertisement