Advertisement

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ ఎన్నిక

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ ఎన్నిక

By: Sankar Mon, 14 Sept 2020 6:10 PM

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ ఎన్నిక


రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు.. వాయిస్‌ ఓట్ ద్వారా ఎన్నిక నిర్వహించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. ఆ తర్వాత హరివంశ్‌సింగ్ ఎన్నికైనట్టుగా ప్రకటించారు.. మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత ఎన్డీఏ తరఫున హరివంశ్ సింగ్‌ పేరును ప్రతిపాదించారు బీజేపీ ఎంపీ జేపీ నడ్డా.. దీనిని థాపర్ చంద్ సమర్థించారు.

మరోవైపు విపక్షం నుంచి ఆర్జేజీ ఎంపీ మనోజ్ ఝా పోటీకి దిగారు.. కానీ, మూజువాణి ఓటు ద్వారా హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ సింగ్ ఎన్నికకావడం ఇది రెండోసారి కావడం విశేషం. హరివంశ్‌ సింగ్ అట్టుడుగు వర్గం నుంచి వచ్చిన మేధావి అని ఈ సందర్భంగా ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోడీ... సభలోని ప్రతీ సభ్యుడుకి హరివంశ్ సింగ్ అంటే గౌరవం.. ఆయన ఈ గౌరవాన్ని సంపాదించాడు..

పార్లమెంటులో ఆయన నిష్పాక్షిక పాత్ర మన ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, బీజేడీ మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికకు టీఆర్ఎస్‌ దూరంగా ఉంది.

Tags :

Advertisement